Home / SLIDER / ఈటలకు మంత్రి గంగుల దమ్మున్న సవాల్

ఈటలకు మంత్రి గంగుల దమ్మున్న సవాల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ‘‘ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోంది. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను.

మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలి. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధంగా ఉన్నాను. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను’’ అని గంగుల వ్యాఖ్యానించారు.