Home / Tag Archives: telanganacm (page 345)

Tag Archives: telanganacm

ఎమ్మెల్సీ కవిత భర్తకు కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్‌లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్‌ ద్వారావెల్లడించారు. తనతోపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని చెప్పారు. ఈ కారణంగా ఎవరినీ కలవలేమని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేనని స్పష్టంచేశారు.

Read More »

జిల్లా ఆస్ప‌త్రుల్లోనూ డ‌యాగ్నొస్టిక్ సెంట‌ర్లు : ‌మంత్రి ఈట‌ల

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగ నిర్ధార‌ణ కేంద్రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు ఇప్ప‌టికే ప్ర‌మాణాల ప్ర‌కారంగా డ‌యాగ్నోస్టిక్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉన్నాయి. దీనికి అద‌నంగా జిల్లా ఆస్ప‌త్రుల్లో కొత్త‌గా డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తుంది. హైద‌రాబాద్‌, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్ప‌టికే రెండు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ ల్యాబ్‌ల‌లో 60 ర‌కాల ప‌రీక్ష‌లు …

Read More »

చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …

Read More »

నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలుగా రైతు వేదిక‌లు : ‌మంత్రి నిరంజ‌న్ రెడ్డి

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రైతు వేదిక‌ల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2,596 రైతు వేదిక‌లు నిర్మించామ‌ని తెలిపారు. రైతు వేదిక‌ల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 ల‌క్ష‌ల మొత్తాన్ని ఖ‌ర్చు చేశామ‌న్నారు. వ్య‌వసాయం, అనుబంధ శాఖ‌ల ద్వారా ఆధునిక వ్య‌వ‌సాయ సమాచారం, అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం, నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలుగా …

Read More »

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్‌ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read More »

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read More »

ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్-మంత్రి హరీశ్ రావు.

ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో గాజు పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్రూప్‌. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్‌ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు …

Read More »

శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన  బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్‌-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్‌(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్‌ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …

Read More »

టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఎస్ ఐపాస్ కింద వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత గ‌త ఆరు సంవ‌త్స‌రాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 ప‌రిశ్ర‌మ‌లు ఆమోదం పొందాయ‌న్నారు. ఇందులో ఇప్ప‌టికే 11,954 ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించాయ‌న్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించామ‌ని తెలిపారు. కాగా ప్ర‌స్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat