ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సంబంధిత ఏర్పాట్లను సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి .ఎస్. లోకేష్ కుమార్ తో పాటు జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల …
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని..?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »ఆగస్టు 5నుండి చేప పిల్లలు పంపిణీ
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్రమత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ ఏడాది 24 చెరువులు, రిజర్వాయర్లలో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
Read More »ప్రత్యేక యాప్ విడుదల
తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన …
Read More »ముస్లీం సోదరులకు విజ్ఞప్తి
బక్రీద్ పండగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల పట్ల రాష్ట్ర డిజిపి శ్రీ ఎం.మహేందర్ రెడ్డి తో హోంశాఖా మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు తన కార్యాలయం లో చర్చించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని ముస్లీం సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని అన్నారు. ఇదే తరహాలో బక్రీద్ పండగ జరుపుకోవాలన్నారు. …
Read More »ఊరు ఊతమై..సాగు సంబరమై..
ఒకప్పుడు తెలంగాణా పల్లెల్ల ఎవుసం బారమై ఊర్లకు ఊర్లు పట్నానికి వలసబాటలు పట్టినై..పొట్టచేతబట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ బస్తీ బాటపట్టి ఏండ్లకు ఏండ్లు అక్కడ ఏదో ఒక పనిచేసుకుని బ్రతికే పరిస్థితులుండే..పంట పండక,నీళ్ళు లేక,కరెంట్ లేక వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొన్న పరిస్థితి.రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసినం.ఆత్మహత్యలకు దైర్యం చాలక అప్పో సొప్పో చేసి బ్రతికి ఆ అప్పు తీర్చడానికి పట్నం పోయి నాగలి పట్టినోళ్ళెందరో తాపీ మేస్త్రీలుగా,రోజు …
Read More »తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స.. * తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స * అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంపిక * మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, రైతులందరి ముఖాలపై చెదరని చిరునవ్వు నిలవాలంటే ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణ దిశగా పయనించాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు సవాల్ విసిరిన నేపద్యంలో ఆయన మూడు మొక్కలను నాటారు. అనంతరం జిల్లా …
Read More »తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Read More »పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్ ఇట్ అప్(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. …
Read More »