Home / SLIDER / గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్

తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, రైతులందరి ముఖాలపై చెదరని చిరునవ్వు నిలవాలంటే ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణ దిశగా పయనించాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు సవాల్ విసిరిన నేపద్యంలో ఆయన మూడు మొక్కలను నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే గ్రీన్ చాలెంజ్ చేశారు. ముగ్గురూ మొక్కలు నాటి, వారు ఒక్కొక్కరూ మరో ముగ్గురికి హరిత సవాల్ విసరాలని కోరారు.

దీంతో పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మూడు మొక్కలను నాటడమే కాకుండా ఎమ్మార్వో ఎం. రంజీత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ బి. ఇంద్రసేనారెడ్డి, వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ లకు హరిత సవాల్ విసిరారు. ఈ నేపద్యంలో పట్టణంలోని బెస్తా బజారులో వైస్ చైర్మెన్ ఫరీద్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. మహిళలు, యువకులతో కలిసి ‘హరితహారం’ కార్యక్రమాన్ని వేడుకలా జరిపారు.

హరిత కార్యక్రమాన్ని విజయవంతం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామంటూ నాటిన మొక్క సాక్షిగా యువకులతో స్వయంగా ప్రమాణం చేయించారు. మొక్కలు నాటిన కాలనీ మహిళలతో కలిసి మున్సిపల్ డిఈ కృష్ణలాల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవినాష్, టీ.ఆర్.ఎస్.పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్ లకు గ్రీన్ చాలెంజ్ చేశారు. ఈ సంధర్భంగా ఫరీద్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా పచ్చని చెట్లతో విరసిల్లిన నాడే వాతావరణ సమతూల్యత ఏర్పడి వర్షాలు విరివిగా కురుస్తాయనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘హరితహారం’ అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు.

కాలాలు సరిగ్గా అయ్యి రైతు ఆనందంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మొక్కల పండుగలో ప్రజలందరూ పాల్గొనాలని అన్నారు. కృష్ణలాల్, అవినాష్, జనార్ధన్ లు తన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడమే కాకుండా వారొక్కొక్కరూ మరో ముగ్గురికి హరిత సవాల్ విసరాలని కోరారు.

పూల, పండ్ల మొక్కలు పెంచాలనుకునే ఔత్సాహికులు తనను సంప్రదిస్తే వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణ,దుగ్గీ లక్ష్మీ, సరోజన,శారద, రాజెశ్వరి,ఉషా,యండి గౌస్,దుగ్గి కార్తీక్, అవారి సంతోష్, యాదగిరి డోలి విరెందర్, జటంగి రంజిత్,బూపతి,భరత్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat