Home / EDITORIAL / ఊరు ఊతమై..సాగు సంబరమై..

ఊరు ఊతమై..సాగు సంబరమై..

ఒకప్పుడు తెలంగాణా పల్లెల్ల ఎవుసం బారమై ఊర్లకు ఊర్లు పట్నానికి వలసబాటలు పట్టినై..పొట్టచేతబట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ బస్తీ బాటపట్టి ఏండ్లకు ఏండ్లు అక్కడ ఏదో ఒక పనిచేసుకుని బ్రతికే పరిస్థితులుండే..పంట పండక,నీళ్ళు లేక,కరెంట్ లేక వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొన్న పరిస్థితి.రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసినం.ఆత్మహత్యలకు దైర్యం చాలక అప్పో సొప్పో చేసి బ్రతికి ఆ అప్పు తీర్చడానికి పట్నం పోయి నాగలి పట్టినోళ్ళెందరో తాపీ మేస్త్రీలుగా,రోజు కూలీలుగా మారిన సంఘటనలెన్నో సమైక్య పాలనలో చూసినం..సమైక్య పాలకులు తెలంగాణా పై చూపిన వివక్ష వ్యవసాయం దండగ అనే పరిస్థితి దాపురించింది.రైతు బిక్కు బిక్కుమంటూ బ్రతికిన పరిస్థితి నాడు ఉంటుండే..బొంబాయి బొగ్గుబాయి అంటూ ఊరిడిచి ఒక్కొక్కరు వెలుతుంటే ఊరంతా కాలీ అవుతుంటే పల్లెలన్నీ గొల్లున ఏడ్చిన సందర్బాలెన్నో..ఉన్న ఊరిని,కన్నవారిని వదిలి వలసెల్లిపోతుంటే దుఃఖంతో నిండిన గడపలెన్నో.పొక్కిలివారిన నేలన ఎన్నో కన్నీటి కథలను తెలంగాణా రాకముందు మనం చూసాం.. కరువు తాండవిస్తుంటే దిక్కులేక కన్నీటి పాటలు పాడుకున్నం..

కానీ నేడంతా అది గతం.నేడు తెలంగాణా పల్లెలు ఉపాదికి మార్గమవుతున్నయ్.ఊరు ఊతమిస్తుంది..వలసలు వాపస్ అయినయ్.బ్రతుకులేక పట్నంబోయినోళ్ళంతా నేడు పల్లెల్లో దొరుకుతున్న ఉపాదికి తిరిగి ఊరిబాటపట్టిర్రు.ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలే దీని వెనక కఠోర శ్రమ ఉంది..తెలంగాణా రాష్ట్ర సాదన పోరాటం జరిగిందే ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్షపై..నాటి ఉద్యమనేత నేటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో స్వరాష్ట్రం సాదించుకున్నాక వారి నాయకత్వంలో తెలంగాణా అద్బుతంలో పురోగమించింది..తెలంగాణా ఏర్పాటుకు ప్రదాన లక్ష్యాలైన నీళ్ళను సాదించుకోగలిగాం.ఒకప్పుడు వ్యవసాయానికి తెలంగాణాలో వర్షాదారమే ఉంటుండేది..వాన ఎప్పుడు పడుతుందా అని రైతు మబ్బుమొహం చూసేటోడు.కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి,కార్యదీక్ష,సంకల్పం వెరసి తెలంగాణా కోటి ఎకరాల మాగాణమైంది.దేశం అబ్బురపడేలా కాళేశ్వరం లాంటి అద్బుత ప్రాజెక్ట్ నిర్మాణం అతి తక్కువ కాలంలో పూర్తి చేయగలిగారు.దాని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు,త్రాగునీరు అందే వీలు కలిగి వ్యవసాయం పండుగలా మారింది.వర్షం కోసం ఎదురుచూడకుండా రైతు దైర్యంగా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో పాలమూరు రంగారెడ్డి,భక్తరామదాసు,కల్వకుర్తి ఎత్తిపోతల,దేవాదుల,రామప్ప పాకాల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణాలో జరిగింది.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తానే స్వయంగా ఇంజనీర్ గా మారి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు..ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులకు అనుసందానం చేయడం తద్వారా ఏడాదంతా చెరువులు నిండుగా ఉండటం ద్వారా గ్రామాలకు జీవకళ ఉట్టిపడినట్లౌతుంది..

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టి సాదిస్తే గ్రామం ఉపాదికి ఒక కేంద్రంగా మారుతుంది.అది జరగాలంటే దాని మూలాల్లోకి వెల్లు సమస్యను తెలుసుకోగలగాలి.గ్రామంలో చెరువు ప్రదాన వనరు దానిపై ఆదారపడి అనేక వర్గార ప్రజలు జీవనం సాగిస్తారు.దీంతో పాటు పల్లె ప్రాంతాల్లో ప్రధాన జీవనాదారం వ్యవసాయం ఇది ఎందరికో ఉపాదిని కలిగిస్తుంది.వ్యవసాయం ఒక పరిశ్రమనే అది ఒక జీవన విదానం..మట్టి నుండి అన్నాన్ని పండించే వాడు రైతు..గ్రామం,రైతు బాగుంటే దేశమంతా బాగుంటుంది..అందుకే స్వయంగా రైతు ఐన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ది,వ్యవసాయాభివృద్దికి ప్రాముఖ్యత ఇచ్చారు..మిషన్ కాకతీయతో తాంబాలంల మారిమ చెరువులకు జీవం పోసి నీటి నిల్వ సామర్ద్యం పెంచారు..వివిద ప్రాజెక్టులు,ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఎండాకాలంలో సైతం చెరువులను అలుగులు పారించారు..తద్వారా రైతుతో పాటు చెరువుపై ఆదారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలకు అది కొండంత భరోసా నిచ్చాయి..చెరువుల్లో మత్సకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేపట్టి వావి జీవనోపాదికి కృషి చేసారు ముఖ్యమంత్రి కేసీఆర్..గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత ప్రణవిల్లేలా కొత్తపంచాయతి రాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఖచ్చితమైన నిర్ణయాలు,కఠినమైన చర్యలతో గ్రామాల్లో నేడు కొత్త శోభ నెలకొంది.ప్రతీ పల్లె నేడు పచ్చదనంతో స్వాగతం పలుకుతుంది..కొత్త జిల్లాలు,కొత్త గ్రామపంచాయతీలతో పరిపాలన సులభతరం చేసి వేగంగా అభివృద్ది జరిగేలా చర్యలు చేపట్టారు.వారు తీసుకున్న ఈ నిర్ణయాలు సత్పలితాలనిచ్చాయి..

గ్రామాల్లో మరో ప్రధానాంశం వ్యవసాయం గతంలో రైతు పెట్టుబడి కోసం అర్థీదారుల వద్దకు వెల్లి అప్పు తీసుకొచ్చేవాడు..వారు వేసే చక్రవడ్డిలతో రైతు అప్పుల పాలయ్యేవాడు.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులు దైర్యంగా వ్యవసాయం చేయాలనే ఉద్దేశ్యంతో దేశమే ఆశ్చర్యపడేలా రైతుకు ఏటా పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రెండుపంటలకు 10 వేల రూపాయలు అందజేస్తున్నారు.ఈ నిర్ణయంతో రైతులు అప్పుల బారిన పడే అవకాశం తప్పింది..దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే అతనికి కుటుంబానికి 5లక్షలు అందే విదంగా ప్రభుత్వమే బీమా చేయించి వారి కుటుంబాలకు ధీమాగా నిలిచింది.ప్రతీ ఒక్కరు సిండికేట్ అయి ఒకే దరకు తమ ప్రొడక్ట్ ను అమ్ముకుంటారు కానీ కష్టపడి పండించే రైతు మాత్రం ఐక్యత లోపించి అవసరం ఇబ్బంది పెట్టి తప్పని పరిస్థితుల్లో గిట్టుబాటు దర వచ్చినా రాకున్నా పంటను అమ్మేసుకుంటున్నాడు.ఆ పరిస్థితి పోవాలంటే,రైతు తన పంట దరను తానే నిర్ణయించుకోవాలన్నా రైతు సంఘటితం కావాలనే ఉద్దేశ్యంతో రైతు వేదికల నిర్మాణం చేపడుతూ రైతు సమన్వయ సమితీల ఏర్పాటు ద్వారా రైతు తన పంటను తానే దరను నిర్ణయించే దిశగా అడుగులు పడుతున్నాయి 24 గంటల నిరంతరాయ విద్యుత్ నేడు వ్యవసాయానికి గొప్ప వరంగా నిలిచింది..ఇలా అనేక నిర్ణయాలు వ్యవసాయానికి ఊతమిచ్చి రైతు లాబాల బాట పట్టేలా చేసాయి..రైతులో వ్యవసాయం పట్ల భరోసా ను పెంచాయి.వ్యవసాయం దండుగ అనే స్థాయి నుండి పండుగ అనే స్థాయిలే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుతో రైతులు సంతోషంగా ఉన్నారు..ఇవేవి పట్టని కొందరు దుష్టగ్రహకూటమి అదే పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శ చేస్తున్నారు.వారి విమర్శలను పట్టించుకోకుండా ఆయన మరింత వేగంగా పాలనను సాగిస్తున్నారు..

కరోనా మహమ్మారి విజృంబన పట్టాణాల కంటె పల్లెలే సేఫ్ అనే ఉద్దేశ్యంతో కళాశాలలు లేకపోవడం,ఉపాది కోల్పోవడం,భయంతో పట్టణాల్లో ఉండలేని వారంతా నేడు స్వగ్రామాలకు చేరుకున్నారు..అలాంటి వారికి నేడు ఊరు ఊతమై నిలిచింది.యువత ఈ సారి ఎవుసం బాట పట్టింది..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతో వ్యవసాయం లాభసాటిగా మారడంతో యువత చూపు ఇప్పుడు వ్యవసాయం పై పడింది.కంప్యూటర్ మౌస్ పట్టిన యువత నేడు నాగలి పట్టారు..ఇది షార్ట్ టైమ్ ఐనా కానీ వారిలో వ్యవసాయం పట్ల శ్రద్దను పెంచేదిశగా ఉపకరిస్తుంది.ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన నియంత్రిత వ్యవసాయ విదానంతో రైతులు ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేపట్టారు.గ్రామాల్లో యువత వ్యవసాయక్షేత్రాల్లో పనుల్లో తలమునకలై ఉన్నారు.ఈ విపత్తు సమయంలో వ్యవసాయం గొప్ప ఉపాది మార్గంగా నిలిచింది.యువత తమ ఆలోచనలకు పదును పెట్టి వ్యవసాయాన్ని ఆదునిక పద్దతులలో చేస్తున్నారు.. వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ రంగం,ఇతర ఉపాది మార్గాలకు గ్రామాలు కేరాఫ్ గా నిలిచాయి..ఒకప్పుడు బ్రతుకుదెరువులేని ఊరులో నేడు కొత్త వెలుగు నిండింది.
కరోనా కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో చేపట్టిన చర్యలు నేడు ఎందరికో ఉపాది మార్గాలుగా నిలిచాయి.వ్యవసాయం చేస్తే నామూషీగా బావించే యువత నేడు లాబాల సాగును సంబురంగా చేస్తున్నారు..సంవృద్దిగా నీళ్ళు,24 గంటల కరెంట్ ,పెట్టుబడిసాయం తో వ్యవసాయం పండగైంది..కరోనా మహమ్మారి పీడతో వలసపోయినోళ్ళంతా వాపస్ అయ్యారు..వారందరిని పల్లె కడుపులో పెట్టుకుంది.ఊరు ఊతమై సాగు సంబురమై నిలిచి నేడు పల్లెలు పట్టుగొమ్మలై నిలుస్తున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుకు పల్లెలు జై కొడుతున్నయ్..

– Telangana Vijay
9491998702

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat