తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు వరంగల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఏ1గా, బూర ప్రశాంత్‌ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్‌తో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో వివిధ కేటగిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి దరఖాస్తులను …
Read More »మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ …
Read More »దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్ …
Read More »బండి పై నమోదైన FIRలో కీలక విషయాలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం …
Read More »రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నపత్రాల లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పదో తరగతి మొదలు, వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పరీక్షలు కాదు..తెలంగాణ రాష్ట్రంలో …
Read More »మంత్రులు కేటీఆర్ సబిత రాజీనామా చేయాలి-బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా. వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.
Read More »అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ విగ్రహా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ …
Read More »పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు
పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ ఆడి టోరియం లో విజయభాను నాట్య కళా మండలి ఆధ్వర్యం లో మహాభారతం లో కీలక ఘట్టం అయిన దమయంతి స్వయం వరం నాటక ప్రదర్శన కు ముఖ్య అతిధి గా హాజరైన మంత్రి నాటకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
Read More »ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం…
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు 37వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో పర్యటించారు. రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ లలో స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రంగారెడ్డి నగర్ లో రూ.1.80 కోట్లతో వివిధ అభివృద్ధి …
Read More »