తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా.
వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.