కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా
చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు.ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో …
Read More »అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి. రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఉచిత …
Read More »టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది.
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …
Read More »అమిత్ షా.. టూరిస్టులా వచ్చిపోతామంటే కుదరదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించాలని, విభజన హామీలను నెరవేర్చాలని సబిత డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి …
Read More »నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి
నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా …
Read More »తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం -జూన్ 10న ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాల భర్తీకి జూన్ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. అలాగే యూపీలో 11, ఏపీలో 4స్థానాలు సహా మొత్తం 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ గురువారం …
Read More »