తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.
Read More »టీఆర్‌ఎస్ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం
టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …
Read More »అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్
దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …
Read More »మోదీజీ.. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటనో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ ధీమా
కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …
Read More »రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్
రాజ్యసభకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో …
Read More »