హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …
Read More »కాంగ్రెస్‌లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »దేశాన్ని బాగుచేయడం కేసీఆర్ వల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో …
Read More »2 గంటల పాటు కొనసాగిన మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీశ్‌రావు వివరంగా చదివి వినిపించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని …
Read More »ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హారీష్ రావు ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్‌రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.కోకాపేట్‌లోని తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని …
Read More »నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Read More »ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.ప్రెసిడెన్షియల్ సూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో …
Read More »మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మంత్రి కే తారకరామారావు ఎన్నారైలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More »