సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్: – వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. …
Read More »మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారు.. ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ …
Read More »అందుకే ఈటల బీజేపీలోకి-మంత్రి సత్యవతి రాథోడ్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్‌ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు …
Read More »మాజీ మంత్రి ఈటలకు ఎమ్మెల్యే గువ్వల వార్నింగ్
అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్లకు పడగలెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎవరూ కాపాడలేరు అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నారని ఫిర్యాదులు చేసిన వారిని ఈటల భయభ్రాంతులకు గురి చేశారు. పేదలను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నిందలు మోపుతున్నారు. ఇవన్నీ గ్రహించిన తర్వాతే సీఎం చర్యలకు పూనుకున్నారు. ఇప్పటి నుంచి ఎక్కడ మాట్లాడినా …
Read More »టీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన మరో కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈటలతో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు బాబయ్య వెల్లడించారు. అయితే ఈటల మాత్రం బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆయన …
Read More »మాజీ మంత్రి ఈటలకు పల్లా కౌంటర్
ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ …
Read More »రూ.7.45కోట్లతో మున్నేరుపై చెక్ డ్యాం
తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు. వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు. నిండు …
Read More »తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,308 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »సూపర్.. మినిస్టర్..మంత్రి అజయ్ కృషికి జేజేలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ నుండి కామన్ మ్యాన్ దాకా.. అందరినోటా అభినందనల మాట..అభివృద్ది..చిత్తశుద్ది..వ్యూహ చతురతకు అందరూ ఫిదా..ఉమ్మడిఖమ్మంపై తిరుగులేని ముద్ర.. అందరివాడుగా మారిన మంత్రి పువ్వాడ..సీనియర్లను మెప్పిస్తూ రాజకీయంగా రాటుదేలిన నేత..పువ్వాడపై యువనేత కేటీఆర్ ప్రశంసలు.. ఆయన నిజంగా సూపర్ మినిస్టరే. ముఖ్యమంత్రి నుండి కామన్ మ్యాన్ వరకు సీఎం టు సీఎం ఆయన కృషికి, వ్యూహచతురతకు, చిత్తశుద్దికి అసాధరణ విజయాలకు అభినందనలు …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్‌తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »