Home / SLIDER / టీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా

టీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన మరో కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈటలతో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు బాబయ్య వెల్లడించారు.

అయితే ఈటల మాత్రం బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆయన మాత్రం తాను ఏ పార్టీలో చేరబోయేది ఇప్పటి వరకూ ప్రకటించలేదు.