పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాతృమూర్తి దాసరి మధురవ్వ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మధురవ్వ మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మధురవ్వ అంత్యక్రియలు స్వగ్రామమైన కాసులపల్లి లో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
Read More »గీతా కార్మిక కుటుంబాలకు మంత్రి హరీష్ రావు అండ
ప్రమాద వశాత్తు తాటిచెట్టుపై నుంచి పడిపోయి, ప్రాణా పాయం తప్పి తీవ్ర గాయాలై, నవడలేని పరిస్థితి నెలకొన్న గీతా కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు అండగా నిలిచారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో గురువారం ఉదయం జిల్లా పరిధిలో ప్రమాదంలో గాయపడిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రమాదానికి గురై నడవలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన రూ.5లక్షల ప్రమాద బీమా …
Read More »25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి? ఎక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు? సర్దుబాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠశాల విద్యాశాఖలో అన్నిరకాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో జిల్లాలవారీగా పదోన్నతులు పోను.. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉన్న ఖాళీలతోపాటు …
Read More »ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ అద్భుత ప్రతిభ
ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ అద్భుత ప్రతిభ చూపుతున్నదని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ)-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్‌ఐజీ) అవార్డు జ్యూరీ ప్రశంసించింది. వివిధ రాష్ర్టా ల ఆడిట్ సంచాలకులు, పంచాయతీ అధికారులతో సీఎస్‌ఐ-ఎస్‌ఐజీ అవార్డు జ్యూరీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆడి ట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ …
Read More »నేడు హస్తినకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను శుక్రవారం, కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్‌సింగ్ పురిని శనివారం కలువనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు మంత్రులతో భేటీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది. వీరితోపాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ …
Read More »” హరీష్ ఆణిముత్యం అనే కేసీఆర్ మాటకు ఒక ప్రత్యేకత ఉంది…”
సరిగ్గా ఆరేళ్ళ క్రితం సిద్దిపేట కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట కు హరీశ్ ఆణిముత్యం అనే మాట (10 – 12 -2014 ).. మళ్ళీ నేడు ( 10 – 12 -2020 ) అదే మాట పలకడం లో హరీష్ ఆణిముత్యం అనే మాటకు ఒక ప్రత్యేకత వచ్చింది… – అరేళ్ళల్లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్.. సిద్దిపేట కు సీఎం …
Read More »సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు
సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. …
Read More »నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన …
Read More »GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …
Read More »రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్
వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »