నిరుద్యోగి ఆత్మహత్య…….విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన దుర్గారావు బీటెక్ చదువుకున్నాడు.ఉద్యోగ సాధన కోసం ఎక్కడికి వెళ్లిన పోటీ ఉండడం, ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు.తీవ్ర మనస్తాపనికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్తానికులు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేట్ …
Read More »విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ.. ప్రభుత్వం స్పందిస్తుందా.?
తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్‌లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా …
Read More »కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు
కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక …
Read More »ఏపీలో మాజీ ఎంపీ కన్నుమూత..!
మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి …
Read More »వైసీపీ నేతల అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం..!
రైతుల పొలాలకు సాగునీరు అందించాలని విజయవాడ ఇరిగేషన్‌శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందించేందుకు వెళుతున్న వైసీపీ నేతలను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వంద మంది రైతులతో కలిసి వైసీపీ నేతలు పార్ధసారధి, జోగి రమేష్ ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు వినతిపత్రం ఇవ్వాలని శాంతియుతంగా బయల్దేరారు. అయితే, వారిని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. సాగునీరు అందించడంలో చంద్రబాబు …
Read More »రాజధానిలో కుమ్ముకున్న తెలుగుతమ్ముళ్లు.. తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు..!
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వీరులపాడులో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో జరిగిన వరుస వివాదాలే ఇందుకు కారణం.. పార్టీ అధికారంలో ఉండడంతో మండలంలో అధిపత్య పోరు కోసం ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వివాదం పెరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో పోపురి అనిల్ తో పాటు మరికొందరిపై కర్రలు, …
Read More »రాక్షసపాలన గుండెల్లో గునపాన్ని గుచ్చే వీరుడు జగన్.. చంద్రబాబు నీచుడు..
రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా పేరూరు లో చంద్రబాబు ప్రసంగిస్తూ రెండు గంటలపాటు ప్రజలను వీరబాదుడు బాది ఇబ్బంది పెట్టారన్నారు. గంటల తరబడి ప్రజలను చిత్రవధ చేసే ప్రక్రియలో భాగంగా నిన్న అనంతలో సభ జరిగిందన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ను చూస్తే వణికిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయసున్న …
Read More »బెజవాడలో చాలాకాలం తర్వాత బయటకొచ్చిన కాంగ్రెస్ నేతలు..!
చాలాకాలం తర్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒకరోజు వచ్చింది. పార్టీ కళకళలాడింది. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కదలికలు కనిపించాయి. గత నాలుగేళ్లుగా అడదడపా ధర్నాలు, ప్రకటనలు తప్ప ఏపీలో కాంగ్రెస్ సందడి లేదనే చెప్పాలి. నిన్న మళ్లీ విజయవాడలో కాంగ్రెస్ కార్యాయలం వద్ద పండగవాతావరణ కనిపించింది. కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చారు. అసలు ఈ హడావిడి మొత్తానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ …
Read More »జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటున్నముస్లిం సంఘాలు .. గ”లీజ్” పనులు మానుకో
ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా …
Read More »ఏపీలో అత్త..అల్లుడిపై..!
ఏపీలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలపై, మహిళలపై దాడులు జరగడం మనకు తెలిసిందే. అయితే తాజాగా పాయికాపురంలో దారుణం జరిగింది. కుమారె భర్త అల్లుడి..అత్త మధ్య తగాదాల ఉన్నాయి. ఈ నేపథ్యంలో…యాసిడ్‌తో అల్లుడిపై కుమార్తె సాయంతో అత్త దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మోహనాచారి పాయికాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అతని భార్య, ఆత్తపై విజయవాడ పోలీసులు కేసు నమోదు …
Read More »