ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని …
Read More »దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. నిన్న శుక్రవారం 3545 కేసులు నమోదైన సంగతి తెల్సిందే. తాజాగా కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్
ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పై WHO హెచ్చరిక
ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ ఇంకా తీవ్రంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 11% పెరిగాయని పేర్కొంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు నిరూపితమైందని చెప్పింది. వివిధ దేశాల రిపోర్టులను బట్టి చూస్తే 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయని వివరించింది.
Read More »ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO
ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ
బ్రిటన్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. బ్రిటన్‌లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. …
Read More »కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన తొలిదేశం ఇదే…?
ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ మేరకు తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. టీకాను పరీక్షించిన వారిలో ఆయన కూమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని పుతిన్ తెలిపారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది. Source : EENADU
Read More »ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్-19 కారణంగా …
Read More »డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ షాక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ.
Read More »కరోనా.. దాని కన్నా 10 రెట్లు ప్రమాదకరం
కరోనా మహమ్మారి 2009లో వణికించిన ప్రమాదకారి స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని పేర్కొంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఈ వైరస్ ముప్పు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వైరస్ బారిన పడ్డ అనేక దేశాలు లాక్డౌన్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ అన్నారు. …
Read More »