మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …
Read More »అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను
టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …
Read More »ఏపీ మంత్రి వర్గ మార్పులు… ఎవరుంటారు.. ఎవరుండరు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల మార్పుతో ఎవరి స్థానంలో ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొంది.ఇందులో భాగంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న మంత్రివర్గ మార్పుల్లో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో ఒక లుక్ వేద్దామా.. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పోస్ట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొడాలి నానిని మార్చాలనుకుంటే నాని స్థానంలో వసంత కృష్ణప్రసాద్, పేర్ని నాని …
Read More »టీడీపీకి 160 సీట్లా.. ఈలోపు మేం గాజులు వేసుకుంటామా?: కృష్ణదాస్
జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఏపీ సీఎం కాకపోతే తమ ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. అచ్చెన్నాయుడి మాటలకు భయపడాల్సిన పనిలేదని.. టీడీపీ …
Read More »NTR తొలి అడుగే ఓ ప్రభంజనం – TDP 40ఏళ్ళ ప్రస్థానానికి తొలి అడుగు పడింది అక్కడే..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి,తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఇటు అప్పటి ఉమ్మడి ఏపీని అటు దేశాన్ని పాలిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రస్తుతం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా తెలుగు దేశం పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం …
Read More »గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్ వల్లే అది సాధ్యమైంది: జగన్
మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …
Read More »ఏపీ కేబినెట్ రీషఫిల్.. జగన్ నిర్ణయం అదే!
ఏపీ కేబినెట్ రీషఫిల్ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది. ఈనెల 30న కేబినెట్ రీషఫిల్ చేయాలని తొలుత సీఎం జగన్ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో …
Read More »సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు …
Read More »సీఎం జగన్ కు కోర్టు సమన్లు – ఈనెల 28న హజరు కావాలని ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న గురువారం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది. 2014సార్వత్రిక ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగిరెడ్డిపై ఎన్నికల …
Read More »మా విధానం మూడు రాజధానులే: అసెంబ్లీలో జగన్
ఏ ప్రభుత్వ విధానాలైనా నచ్చకపోతే ప్రజలే వారిని ఇంటికి పంపిచేస్తారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన నచ్చపోవడంతోనే 175 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని చూసి ప్రజలే తీర్పు ఇస్తారని.. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదేనని చెప్పారు. శాసనసభలో వికేంద్రీకరణపై అంశంపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అసాధ్యమైన టైం లైన్స్‌తో నెలరోజుల్లో రూ.లక్ష …
Read More »