గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ గట్స్ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …
Read More »ఏపీ మంత్రికి లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …
Read More »ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని
ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే …
Read More »తిరుమలకు సీఎం జగన్
తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 23వ తేదీన తిరుమలకు రానున్నట్టు సమాచారం. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి …
Read More »భూమన లేఖ చదివితే సెల్యూట్ కొట్టాల్సిందే
ఆ లేఖను ముఖ్యమంత్రికి ముడిపెట్టడం నవ్వు తెప్పించింది..! ********************************** బిజెపి నేత సునీల్ థియోధర్ కి భూమన లేఖ *******************************## శ్రీ సునీల్ థియోధర్ గారికి నమస్కారం. మీరు ట్విట్టర్ లో నా గురించి ప్రస్తావించిన విషయం చదివి ఈ వివరణ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. ఒక భారతీయుడిగా, హైంధవ ధర్మం పట్ల అపార నమ్మకం గల భక్తుడిగా భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం …
Read More »అవినీతిపై జగన్ బ్రహ్మస్త్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను …
Read More »ఉద్దానం గోసకు చెక్.. జగన్ శాశ్వత పరిష్కారం
ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »ఏపీలో కరోనా డేంజర్ బెల్స్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,012 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇందులో 85,945 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,01,234 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 88 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2650 …
Read More »