Home / ANDHRAPRADESH / వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు.

ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్‌ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు.

ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు.

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారని… సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయని వాసుపల్లి గణేశ్‌ తెలిపారు.