Home / SLIDER / తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు .

ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన రేవంత్ రెడ్డి ..మరొకరు ఇదే కేసులో మరో నిందితుడు అయిన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య .అయితే తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన ఎల్ రమణ అధికారంలోకి రాకుండానే మంత్రి పదవులను పంచుతున్నారు .

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం .అప్పుడు మహిళలకు ఆరు మంత్రి పదవులు ..ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తాం అని తేల్చి చెప్పారు .అయితే ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలంగాణ లో ఉన్న పార్టీ నేతలు ..క్యాడర్ అంత అధికార గులాబీ గూటికి వెళ్ళితే అధికారంలోకి ఎలా వస్తుంది .ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రజలను గాలికి వదిలేసి కేసీఆర్ సర్కారు మీద పడుతున్నారు .ఇలా అయితే అధికారం సంగతి దేవుడు ఎరుగు .ప్రస్తుతం ఉన్న మూడు స్థానాల్లో టీడీపీ గెలిస్తే అదే అధికారం వచ్చినంత సంబరం అని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు .