గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు. తొలుత లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శించిన విజయ్ రూపానీ తాజాగా వెనుకబడిపోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఊహించినట్టే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. దీంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యేటట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 90 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 87స్థానాల్లో బీజేపీ, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. క్షణక్షణానికి ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తిరబడే అవకాశముంది. కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని చోట్ల దూసుకెళుతున్నారు. గంట క్రితం సంబరాలు చేసుకున్న కమలనాధులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
