Breaking News
Home / SLIDER / విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …

విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …

ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం .

తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కేవలం ఐదు పరుగులకే ఔట్ అయ్యాడు .దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రత్లామ్ నివాసి బాబూలాల్ భైరవ్ (63)ఏళ్ళ వయస్సున్న విరాట్ అభిమాని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు .

అయితే మ్యాచ్ లో బ్యాటింగ్ బాగా చేస్తాడని భావించిన బాబూలాల్ విరాట్ కేవలం ఐదు పరుగులకే ఔట్ అవ్వడంతో తీవ్ర నిరాశకు గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు .ఈ క్రమంలో ఒళ్ళు అంత తీవ్రంగా కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు .