ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన ‘ప్రజాసంకల్ప యాత్ర’తో జగన్ మొత్తం 125 నియోజకవర్గాలను సందర్శిస్తారని అలాగే దారి పొడవునా ప్రజలను కలుసుకొంటూ వారి కష్టనష్టాలను తెలుసుకొంటూ జగన్ పాదయాత్ర సాగుతుందని అనాడే వైసీపీ పార్టీ ప్రకటించింది. ఈ పాదయాత్రతో జగన్ మొత్తం మూడు వేల కిలోమీటర్ల దూరం నడువనున్నారు. ఇప్పటికే కడప , కర్నూల్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ముగించుకొని ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. 1200 వందల కిలో మీటర్ల మైలురాయిని కూడ చేరుకుంది. వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వేలాదిగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. అయితే మరి కొన్ని రోజుల్లో 100 రోజులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర చేరుకోబోతున్నది. అయితే ఇన్ని రోజులుగా చేస్తున్న పాదయాత్రలో నవరత్నాలతో పాటు…జగన్ ఇచ్చిన కొన్నిహామీలు ఏవేవంటే…
పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్
రైతులకు వడ్డీలేకుండా రుణాలు
ప్రతి ఏడాదీ మే నెలలో రైతులకు పెట్టుబడి నిధి కింద.. 12,500
ఒక ఎకరాలో వ్యవసాయం చేసే రైతుకు 90 శాతం, రెండెకరాల రైతుకు 50 శాతం పెట్టుబడి
నీళ్లు పడక పదే పదే బోర్లు వేసి రైతులు నష్టపోతున్నారని, రైతులకు ఉచితంగా బోర్లు
రైతులకు గిట్టుబాట ధర
మూడు వేల కోట్ల రూపాయలతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు
ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్.
అనాథలుగా మిగిలిన వృద్ధుల కోసం మండలానికో వృద్ధాశ్రమం.
ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు విద్యార్థులకు హాస్టల్ ఫీజు కోసం మరో రూ.20 వేలు.
వృద్ధాప్య పెన్షన్ ను రెండు వేలకు పెంపు, వీలైతే మూడు వేలు
ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
కడపలో స్టీల్ ప్లాంటును పూర్తి చేసి పది వేల ఉద్యోగాలు..వీటితో పాటు మరెన్నో వైఎస్ జగన్ హామీలు ఇస్తున్నారు.