ప్రముఖ నటుడు,రాజ్యసభ ఎంపీ,మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం లోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయల నిధులను విరాళంగాఇచ్చారు .మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి మంజూరు చేశారు . దీంతో తన హర్షాన్ని తెలియజేస్తూ.. చిరంజీవికి ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.
