ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి దూకిన కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు తీసుకుంటామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారిలో చాలామంది అనవసరంగా టీడీపీలోకి వెళ్ళామని బాధపడుతున్నారని అంతేకాకుండా వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా దక్కే అవకాశం లేదని ఆయన అన్నారు.
see also : టీడీపీ భారీ స్కెచ్.. మొత్తం 14.77 లక్షల వైసీపీ ఓట్లు తొలగింపు..!
ఇక టీడీపీలో ఆ జంపిగ్ బ్యాచ్‌కి తరచూ వివాదాలు.. జనాల్లోకి వెళితే అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో తమ భవిష్యత్తు పై ఆందోళన చెందుతూ.. తిరిగి వైసీపీలోకి తిరిగి వచ్చేస్తామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కబురు పంపుతున్నారు. వారి పరిస్ధితిని అర్దం చేసుకున్న జగన్ కూడా ఆమధ్య సానుకూలంగానే స్పందించారు. అయితే ఫిరాయింపుల వరకూ ఓకే గానీ టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం వైసీపీ చేర్చుకునేది లేదని.. ఒకవేళ వైసీపీలో చేరాలనుకుంటే.. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే అభ్యంతరం లేదన్నట్లు జగన్ ఆమధ్య చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జగన్ నిర్ణయం ఫిరాయింపులకు ఒక విధంగా నెత్తిన పాలు పోసేదే అని చెప్పవచ్చు. కాకపోతే వచ్చే ఎన్నకల్లో వారికి టిక్కెట్లు ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేము.
see also : ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!