కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను.
ప్రస్తుతం రానున్న రజనీ మూవీ కాలా చిత్రీకరణ సమయంలో రజనీతో మిమ్మల్ని రహస్యంగా మీట్ అవ్వచ్చా అని అడిగాను .దానికి రజనీ అంగీకారం తెలిపారు.దీంతో ఒక కార్లో మేమిద్దరం రహస్యంగా భేటీ అయ్యాము.ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై పలు అంశాల గురించి చర్చించాం అని ఆయన అన్నారు .అయితే తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తా అని చెప్పగానే ఆయన షాక్ కు గురయ్యారు అని కమల్ ఆ పత్రికలో వివరించారు ..