తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
see also :డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…!
see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!
ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని ప్రకటించింది. చేనేత కార్మికుల రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేసింది. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి నెలాఖరు వరకు ఉన్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.కాగా ఇప్పటికే చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు, ఇతర మెటీరియల్ పై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తోంది.
see also :జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!!