తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ కట్టి నిలబడే పరిస్థితి ఉండేది.అలాంటి పరిస్థితిని ప్రజల ఇబ్బందులను మంత్రి హరీష్ రావు గ్రహించారు పలు మార్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దృష్టి కి తీసుకెళ్లారు.
see also : ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట లో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు లో నిరంతర కృషి చేసారు..మంత్రి హరీష్ రావు కోరడం తో ఎంపీ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన సిద్దిపేట పాస్ పోర్ట్ కేంద్రం కావాలని..కేంద్ర మంత్రిని కలుస్తూ సిద్దిపేట ప్రజలు ఇబ్బందులు ,జరిగిన అభివృద్ధిని ,పెరిగిన జనాభా ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చి పాస్ పోర్ట్ కేంద్రం మంజూరు చేపించారు.గత ఏడాది లో కేంద్ర టెలికాం శాఖ మంత్రి ని కలిసి పాస్ పోర్ట్ కేంద్రం నూతన కార్యాలయం ,మౌలిక వసతులు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు…ఇలా నిరంతరం సిద్దిపేట పాస్ పోర్ట్ ఏర్పాటు లో పర్యవేక్షణ చేస్తు కృషి చేసారు.
see also :హోటల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైద్రబాద్ , కరీంనగర్ లలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఎంపిల కృషితో మొదటి దశలో వరంగల్ , మహాబుబ్ నగర్ లో ప్రారంభం కాగా రెండవ దశలో సిద్దిపేట జిల్లా తో పాటు తదితర జిల్లాలో మంజూరు అయ్యాయి… వరంగల్ లో ఇటీవల ప్రారంభం కాగా సిద్దిపేట లో 28న ప్రారంభం కానుంది…..హైద్రబాద్ ,కరీంనగర్ ,వరంగల్ తరహాలో సిద్దిపేట లో పూర్తి స్థాయిలో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది.