పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు.
see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!
టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా సామాన్యులకు ఉపయోగపడకపోతే లాభముండదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలితాలు ప్రజలకు అందినప్పుడే అభివృద్ధిలో పురోగతి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్, మీసేవ కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!
see also :అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా
Minister @KTRTRS addressing the gathering at the launch of T App Folio in Hyderabad. pic.twitter.com/U0qyqCde7x
— Min IT, Telangana (@MinIT_Telangana) February 28, 2018