వారిద్దరూ రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థులే..ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపిస్తూ నిత్యం ఒకరిపై ఒకరు కత్తి దూసుకుంటారు.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పొగడ్తల వర్షం కురిపించారు.
see also :శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కుమ్మక్కై జగన్ పై అక్రమ కేసులను బనాయించారు.ఈ తతంగం అంతా దివంగత టీడీపీ సీనియర్ మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు,కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శంకరరావు కల్సి కోర్టులో కేసులు వేశారు.ఈ కుట్ర వెనక ఉండి నడిపించింది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ,ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని అప్పట్లోనే రాజకీయ వర్గాలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా.
see also :జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!
అయితే తాజాగా తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో బాబు మాట్లాడుతూ “దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంతవరకు ఆయన తనయుడు,ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నేతలకు మంచివాడే.ఎప్పుడు అయితే వైఎస్సార్ చనిపోయాడో..జగన్ సోనియాగాంధీను ఎదిరించాడో అప్పుడే జగన్ మంచోడు కాకుండా పోయాడు.తనను ఎదిరించాడు అని ఒకే ఒక్క కారణంతో జగన్ పై కేసులు బనాయించారు.జగన్ ముక్కుసూటి మనిషి.ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడతాడు.ఇది నచ్చక సోనియాగాంధీ అలా కేసులు బనాయించారు అని ఆయన చెప్పడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.ఇది అన్నమాట బాబు జగన్ పై పొగడ్తల వర్షం వెనక ఉన్న గుట్టు.
see also :”ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!!