తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే ఈ బస్సు తయారీ ,కొనుగోలు పై 8 మంది సభ్యులతో రవాణా ముఖ్య కార్యదర్శి సునీల్ కమిటిని ఏర్పాటు చేశారు.
see also :సుప్రీం కోర్టులో చిదంబరంకు బిగ్ షాక్..!
కాగా ప్రస్తుతం సీఎం కాన్వాయ్ లో ఉన్న ఒస్సు 2014 లో రూ. 4 కోట్లతో ఆర్టీసీ నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 16 మంది మాత్రమే కూర్చొనే అవకాశముంది.అయితే ఇప్పుడు నూతనంగా కొనుగోలు చేసే బుల్లెట్ ఫ్రూఫ్ ఒస్సులో ఎక్కువ మంది కూర్చునే అవకాశం ఉంది. భద్రతాపరమైన ప్రమాణాలకు అనుగుణంగానే కాకుండా పూర్తి సౌకర్యవంతంగా కొత్త బస్సు ఉండాలని నిర్ణయించారు. బుల్లెట్స్, డేంజరస్ ల్యాండ్ మైన్లు కూడా తట్టుకునే శక్తి ఈ బుల్లెట్ ఫ్రూఫ్ బస్సుకి ఉండాలని అధికారులు భావించారు.
see also :పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇలా చేశారు..వైఎస్ జగన్ తో ఓ అమ్మాయి