ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అయన అన్నారు.గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని… 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.గొర్రెల పంపిణీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అయన పేర్కొన్నారు.
