తమ కష్టాలను ఆలకించి, తమ కన్నీరును తుడిచేందుకు ప్రజాసంకల్పయాత్రగా తరలివచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ కు ఎదురేగి స్వాగతం పలికారు. మా ఆశవు నీవేనయ్యా.. మారాజువు నీవేనయ్యా అంటూ అక్కున చేర్చుకున్నారు. కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక సతమతమవుతున్న సామన్యులు. ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ కు తమ గోడు వినిపించారు. జనసంద్రమైన దారుల మధ్య కన్నీటి గాథలు, బతుకు వెతలు వింటూ, వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
అయితే ప్రజాసంకల్పయాత్ర నేటికి మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్రలో వేలాది మంది జగన్ తో అడుగులో అడుగు వేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పోన్నూరు ఐలాండ్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగా సభలో మాట్టడుతూ..మనం రోజు పొద్దునే లేవగానే ఏమీ చేస్తాం దేవుడా మంచి జరగాలి అని కొరుకుంటాము. కాని చంద్రబాబు మాత్రం పొద్దునే లేచినప్పటినుండి..జగన్..జగన్..జగన్ అంటున్నాడు.ఆయన మంత్రలు కూడ జగన్ ఇట్లా..జగన్ అట్లా అంటూనే ఉంటారు. నాకు ఇంకా బాగా అర్థమయ్యింది ఏమీటంటే..చంద్రబాబుకి నేను అర్ధరాత్రి కుడ కలలోకి వస్తానమో…జగన్ అని లేచి నిలబడతాడేమోనని నాకు అనిపిస్తుంది అన్నారు.అంతేగాక ప్రత్యేక హోదా, రైతుల రుణమాఫీ, నిరుద్యోగులకు చేసిన వాగ్గనాలు పచ్చి అపద్దాలు అని సభలో వైఎస్ జగన్ తెలిపారు.