Home / ANDHRAPRADESH / చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!

చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది ఉన్నట్లుగా జగన్ టీమ్ పెట్టిన పెట్టిన పోస్టు ఏమిటంటే “నేరస్తులు పాలిట నేను సింహస్వప్నం, నేను అంటే నేరస్తులు భయపడతారు న దగ్గరికి కూడా రారు అని డప్పు కొట్టుకొంటున్న చంద్రబాబు గారు దీనికి మీ సమాధానం ఇస్తారా ?
వైయస్సాఆర్ గారి తండ్రి వైయస్ రాజా రెడ్డి గారి హత్య లో నిందితులకు నీ పార్టీ ఆఫీస్ లో షెల్టర్ ఇస్తాఉ. వాళ్లకు నీ పార్టీ లో పదవులు ఇస్తావ్, రాజ్యాంగ పదవులు ఇస్తావు .

వాళ్ళను క్షమాబిక్ష కింద బయటకు వదిలి నీ పార్టీ లో రాజకీయం చేయమంటావ్. వంగవీటి మోహనరంగారావు గారిని కిరాతకంగా చంపిన ఘటనతో నీకు సంబంధం లేదా ?. ఆ సంఘటన లో సంబంధం ఉన్న వ్యక్తులకు మంత్రి పదవులు, స్పీకర్ పోస్ట్ లు ఇచ్చావ్.స్వయంగా నువ్వే ఓటుకు నోటు కేసు లో నీ పేరు చార్జ్ షీట్ లో లేదా ? . నీ శిస్యుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు లో అడ్డంగా దొరికి జైలు కెళ్ళి వచ్చాక నీ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించలేదా . రౌడీ షీటర్ సుబ్బు తో నువ్వు నీ కొడుకు నిత్యం తిరుగుతారు .దొంగనోట్లు కుంభకోణం రామకృష్ణ గౌడ్ నీ మనిషి కాదా ?.దొంగ స్టాంపుల కుంభకోణం కృష్ణ యాదవ్ నీ మనిషి కాదా ? .నీ కార్ నెంబర్ ప్లేట్ వాడి 7కోట్లు అక్రమంగా తరలిస్తూ దొరికిన చంద్రగిరి నియోజకవర్గం పేరం హరిబాబు నీ మనిషి కాదా ? .

ఐఎంజి భూముల కుంభకోణం బిల్లీరావు నీ బినామీ కాదా?. దొంగ పాస్స్పోర్టుల కుంభకోణం ముజఫర్ అలీ ఖాన్ కు మలక్ పేట టికెట్ ఇచ్చి నువ్వు ప్రచారం చేయలేదా ? . మరిశం బ్యాంకు కు డబ్బులు ఎగ్గొట్టి ఇప్పుడు కేసుల్లో ఉన్న సుజనా చౌదరి నీ పార్టీ ఎంపీ కాదా ?. అక్రమాలు చేస్తూ బతుకుతున్న సీఎం రమేష్ నీ పార్టీ రాజ్యసభ ఎంపీ కాదా? .అధికారికంగా నువ్వు ముఖ్యమంత్రి కానీ నీ వెనకవుండి నడిపించింది నీ రాజా గురువు రామోజీ రావు కాదా ?. నీ పరిపాలన లో వేల ఏలరాలా భూమి నొక్కేయలేదా ?. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు లో రాజా గురువు రామోజీ రావు లేడా?. కేంద్ర రాష్ట్ర మంత్రుల పక్కన కుర్చీ ఏసీ కూర్చోబెట్టి నీ గురుభక్తిని నిరూపించుకున్నప్పుడు ఏమైంది నీ మందబుద్ధి ? . కాల్ మని సెక్స్ రాకెట్ కుంభకోణం లో నిందితులు నీ పార్టీ లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు గా చెలామణి అవుతున్నారు వాళ్ళందరూ నీకు తెలియదా ? .

చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళను నీ ప్రభుత్వ హయాంలో నిందితుడు అని కోర్టులు కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చినా కూడా నువ్వు అరెస్ట్ చేయకుండా వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చి గెలిపించావ్. .నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా అధికారులను జుట్టు పట్టి ఈడ్చి కొట్టితే, ఇద్దరినీ కూర్చోబెట్టి మద్దిష్టం చేసి వాళ్లకు రాజి చేస్తావ్.సమాధానం చెప్పు బాబు వీళ్ళందరూ నీకు కనపడకుండా నీ నెత్తిన ఎక్కి తాండవం చేస్తున్నా కూడా నీకు కనపడదా ?? ..చంద్రబాబు నాయుడూ…………….15 ప్రశ్నలు ఇవే:!!???1. చంద్రబాబు … మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదు?.2. సీబీఐ, ఈడీ, ఆర్ఓసీ, ఎస్ఎఫ్ఐఓ, ఏసీబీ విచారణల్ని ఎలా తప్పించుకున్నావ్? ఇందు కోసం ఏయే పార్టీల్ని, వ్యక్తుల్నీ ఎలా ఉపయోగించుకున్నావ్?.3. 1998 జనవరిలో బీజేపీ వాళ్ళు నిన్ను శిశుపాలునితో పోలుస్తూ.. నువ్వు చేసిన 100 ఘోరాలు – నేరాలను ‘ప్రజాకోర్టులో బీజేపీ చార్జిషీట్’ పేరుతో ప్రచురించారు. మీరు వెంటనే కంగారుపడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బీజేపీతో డీల్‌ కుదుర్చుకోలేదా?.4. నీ సింగపూర్‌, మలేసియా, ఇతర దేశాల్లో ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి?.5. సీమాంధ్రను దోచుకున్నది, తెలంగాణను సర్వనాశనం చేసిందీ – ఆ దోచుకున్నది సింగపూర్‌లో నువ్వు దాచింది నిజం కాదా?.

6. నీ 1999 మేనిఫెస్టోలో నువ్వే చెప్పావు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఫ్లైట్‌ లేదు గానీ, రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని రాసుకున్నావ్. (టీడీపీ 1999 మేనిఫెస్టో – 13వ పేజీ 17వ లైను). రోజూ సింగపూర్‌ ఫ్టైట్‌లో నువ్వు అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో తరలించిన క్యాష్‌ ఎంత? గోల్డు ఎంత? డైమండ్సు ఎన్ని? నీ ఫ్యామిలీస్‌లో వాళ్ళు దిగేసుకుంటున్న వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, కెంపులు ఎవడబ్బ సొమ్ము?7. కోలా కృష్ణమోహన్, దొంగ నోట్ల రామకృష్ణ గౌడ్, భారతదేశంలోనే అతి పెద్ద స్టాంపుల కుంభకోణంలో నిందితుడు తెల్గీ, హసన్‌ ఆలీలతో నీకున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల మీద విచారణకు నీవు సిద్ధమేనా? మకావో ఐలాండ్సుకు మీరు ఏకంగా 5 పర్యాయాలు డీల్సు కోసం వెళ్ళింది నిజం కాదా?8. ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేశ్, ఒక నామా నాగేశ్వరరావు, ఒక మురళీమోహన్… ఇలా ఓ 10 మందిని వేల కోట్లకు పడగలెత్తించటం పరిపాలన అవుతుందా?.

వారి మీదా, నీ మీదా జాయింట్‌గా సీబీఐ లేదా మరో సంస్థతో విచారణ చేయిస్తామంటే నువ్వు రెడీనా?9. నువ్వు, నీ కుటుంబ సభ్యులు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలు అన్నింటి మీద విచారణకు నీవు సిద్ధమేనా? అది జరిగితే నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ బయటపడి కనీసం 10 దేశాల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదా? ఈ 20 ఏళ్లలో నీ పాస్‌పోర్టులు, నీ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు, వాటన్నింటి మీద స్టాంపింగ్‌లు, అందులో కాగితాలు చించివేయకుండా రిలీజ్‌ చేయటానికి నీవు రెడీనా?10. బాలాయిపల్లి భూముల కొనుగోలు మీద విచారణకు నీవు సిద్ధమేనా? నీ తండ్రి నీకు ఇచ్చిన పొలాన్ని ఆయనకే అమ్మేసినట్టు చూపావు. ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? మీ నాన్న పేరు మీద నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ల వ్యవహారంపై దర్యాప్తుకు నీవు రెడీనా?11. చివరికి నీ తల్లిని కూడా నీ మనీ ల్యాండరింగ్‌ కోసం వాడుకోలేదా? ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ తన ఆస్తిని సమంగా పంచుతుంది. అలాంటిది చిత్తూరు జిల్లాలోని మీ రెండున్నర ఎకరాల నుంచి కోట్ల రూపాయలు పంట పండినట్టు లెక్కల్లో చూపించావు.

నీ పొలంలో ఏమన్నా 500 రూపాయల కట్టలు, వెయ్యి రూపాయల కట్టలు పండే చెట్లు ఆ రోజుల్లోనే వేయించావా? తల్లి పేరు మీద మనీ ల్యాండరింగ్‌ చేసి, ఆమెకు ద్రోహం చేసిన నువ్వు అదే బుద్ధితో తెలుగుతల్లికి కూడా ద్రోహం చేసి ఈ రాష్ట్ర విభజనకులేఖ ఇవ్వటం, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి విభజనకు అంగీకరించటం నిజం కాదా?12. జాయింట్‌ అకౌంట్‌లో డబ్బు వేయించుకుని చివరికి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల సొమ్ముని మింగేసిన చరిత్ర నీది
కాదా? ఏలేరు స్కాం విచారణను ఎందుకు అడ్డుకున్నావ్? నీ పేరు మీద లేదా నీ బినామీ పేరు మీద ఇప్పటికీ ఆ జాయింట్‌ అకౌంట్‌ అలాగే ఉన్న మాట వాస్తవం కాదా? రైతుల నోరు కొట్టి సొమ్ములు తిన్న నువ్వ – గత 15 ఏళ్ళుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవకుండా పోయిన మాట వాస్తవం కాదా?13. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు
వేయకూడదని విప్‌ జారీ చేసినందుకు మీకు ముట్టింది ఎంత?

చిన్న వర్తకుల జీవితాలతో చెలగాటమాడే విదేశీ పెట్టుబడుల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటానికి వీలుగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నీ ఎంపీలు ముగ్గుర్ని గైర్హాజరు చేయించినందుకు ముట్టిందెంత? రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు ట్రాన్సుఫర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ మీకు ట్రాన్సుఫర్‌ చేసిన డబ్బు ఎంత? ప్రతిసారీ ఢిల్లీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కళ్ళు గప్పి వైట్‌ కారులో మాయం అవుతున్నారు? ఎవరెవర్ని కలిశారు?14. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ ముందు నడుస్తున్న గొర్రె అయితే – మీరు ఆ వెనక నడుస్తున్న గొర్రెలా కాంగ్రెస్‌ పార్టీ విధానాన్నియథాతథంగా అనుసరించారంటే ఇందులో డీల్‌ ఏమిటి? శాసనసభలో, శాసన మండలిలో, లోక్‌సభలో, రాజ్యసభలో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ మందలో ఓ వీర విధేయమైన గొర్రెలా మీరు నడిచింది ప్రజలు చూడలేదా?15. మీ అవినీతి సామ్రాజ్యం ఊడలు, కొమ్మలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. దాని మొదలూ వేళ్ళూ విశ్వం అంతా వేళ్ళూనుకుని ఉన్నాయి. నిజాయితీగా రాజకీయాలు చేసేవారే అయితే..

జగన్మోహన్‌రెడ్డిలా ధైర్యంగా కేసులను ఎదుర్కొనేవారు. జైల్లో పెట్టినా తొణకకుండా, బెణకకుండా, రాజీ పడకుండా ప్రజలనే నమ్ముకునే వారు. 14 ఏళ్ళుగా గెలవకపోవడం అంటే రాజకీయంగా యావజ్జీవ కారాగారశిక్షతో సమానం కాదా?. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా ఉరికంబం ఎక్కించడానికి రాష్ట్ర విభజన వద్దన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాస్తవం కాదా?రౌడీ షీటర్లు, పెద్ద కేసుల్లో నిందితులను నీ చుట్టూ పెట్టుకుని నిత్యం రాజకీయం చేస్తున్న నువ్వు నేరస్తులు నా దగ్గరకు రారు అంటే దేనితో నవ్వాలో అర్థం కాక నీ గురించి తెల్సిన ప్రజలు ఉన్నారు సార్.నీ లీలలు నీ పార్టీ లీలలు అన్ని రాయాలంటే ఒక గ్రంధం అవుతుంది కానీ ఇది ఫేస్బుక్ కాబట్టి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే రాశాము అంటూ వారు ఒక పోస్టు పెట్టారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat