ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో వైసీపీకి కావలసిన మద్దతును కూడగట్టతున్నాడు.
ప్రస్తుతం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో 138వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర చేయనున్నాడు. కనకదుర్గ వారధి గుండా యాత్ర చేస్తూ ఆయన కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టాడు. అయితే జగన్ ఎంట్రీ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా బెజవాడ లో స్వాగత తోరణాలతో ,ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు .ఈ క్రమంలో జగన్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తూ.. పాదయాత్రలో పాల్గొన్నారు .అందులో భాగంగా జగన్ కనకదుర్గమ్మ వారధిపైకి వచ్చారు .
అయితే ఒక్కసారిగా అందరూ (కొన్ని వేలమంది)వంతెనపైకి రావడంతో వంతెన కొంచెం సేపు ఊగినట్లు అయిందని సబచారం. దారి పొడవునా వైసీపీ అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు ఒక ఫోటో చూసి గజగజవణికి పోయాడంటా.. నిజానికి ఆ ఒక ఫోటో చూస్తేనే ఎంతటివారికైన భయం కలుగుతుంది. అదేమిటంటే కనకదుర్గమ్మవారధిపై వైఎస్ జగన్ జనసందోహంతో పాదయాత్రతో వస్తున్నప్పటి ఫోటో. టీడీపీ శ్రేణులు సైతం బెజవాడలో జగన్ పాదయాత్రకు అంత సీన్ లేదని అనుకున్నారు . కానీ విజయవాడలో ఎవరు ఊహించని విధంగా వైఎస్ జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడంతో ప్రస్తుతం చంద్రబాబును ఆ ఒక్క ఫోటో కలవరపెడుతుందట. ఓ వైపు టీడీపీ వారు జగన్ ఫాలోయింగ్ కు వణుకుతుంటే..మరోపక్క వైసీపీ పార్ఠీ నేతలు తమ నాయకుడే 2019 లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.