Home / ANDHRAPRADESH / బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!

బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సభలోనే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని ప్రకటించారు.‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ సరైన విధంగా గౌరవించలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి వచ్చిన క్షత్రియ కులస్తులు ఇదే విషయాన్ని గుర్తుచేశారు. రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..’’ అని జగన్‌ చెప్పారు.కాగా కొద్ది రోజుల కిందట నిమ్మకూరులో జగన్‌.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా జగన్ చేసిన ఈ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయేలా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.