తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు దేశంలో ఏ స్పీకర్ చేయని విధంగా కాసేపు రైతులా మారి నాగలి పట్టి దుక్కి దున్నాడు.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఆయన పల్లె నిద్ర చేశారు. ఉదయం ప్రజలతో కలిసి వెళ్లి గ్రామంలోని లోటుపాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ శివారు మీదకు వచ్చి ఇలా నాగలి పట్టారు.వర్షాలు పడి సాలు కూడా మెత్తగా వుండటంతో స్పీకర్ దున్నటాన్ని ఎంజాయ్ చేశారు.
see also:ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్