వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు బ్రేకులు పడతాయి అని అందరు అనుకున్నారు .అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రైలు ,రోడ్డు వంతెనల మీద జగన్ పాదయాత్ర చేస్కోవచ్చు అని పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .అయితే అంతకంటే ముందు కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్లో జగన్ భారీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వని పోలీసులు తాజాగా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .దీంతో వైసీపీ జెండాలతో రాజమండ్రితో సహా రైలు ,రోడ్డు వంతెన రెపరెపలాడుతుంది.
