ఎప్పుడూ చూసినా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీ ఉంటుంటారు.అయితే ఇవాళ ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాద్ నగరంలోని యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బును ఆపదలో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను విజయ్ కోరిన విషయం తెలిసిందే.
see also:మంత్రి కేటీఆర్ పై ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్..!!
ఈ క్రమంలోనేఇవాళ సాయంత్రం కేటీఆర్ నగరంలోని విజయ్ ఇంటికి అతిథిగా వెళ్లారు. ఇదే విషయాన్ని విజయ్ తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘మీ ఇంటికి లంచ్ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది.? ఒక్క సెకను.. అసలు ఏం జరుగుతోంది బాసూ..? బేసిక్‌గా ఏమైనా జరగొచ్చు. మనకు ఏది నచ్చిది దాన్ని చేసుకుంటూ పోవాల్సిందే.’ అంటూ తన ఫ్యామిలీతో కేటీఆర్ ఉన్న ఫొటోను షేర్ చేశారు.’కేటీఆర్‌కు నా ఫిల్మ్‌ఫేర్ చూపించా, వేలం గురించి వివరించా. హ్యాండ్‌లూమ్స్‌పై అవగాహన గురించి చర్చించాం అని విజయ్ ఫోటో షేర్ చేశారు.
Showed him my filmfare, updated him on the auction. Spoke about my Rowdies, he educated us on handlooms, water harvesting, why Hyderabad roads are being dug up, history, being successful, his father & boss, his son, and 'stop using plastic Vijay' 🙂
Dream big rowdies, full ❤ pic.twitter.com/u0t1TPYvQl
— Vijay Deverakonda (@TheDeverakonda) June 24, 2018
When your favourite Leader comes home for lunch ☺ One second ?Asalu em jargutundi bossu? Basically em aina jargochu??We just have to keep doing what we love to do. pic.twitter.com/8aZ0qv1NCu
— Vijay Deverakonda (@TheDeverakonda) June 24, 2018
see also:ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!