Home / MOVIES / ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు.. కోర్టు నోటీసులు..!

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు.. కోర్టు నోటీసులు..!

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాన‌టు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఆయ‌న బ‌యోపిక్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ త‌నయుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు కుటుంబ స‌భ్యుల నుంచి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

see also:అద్దిరిపోయే రేంజ్‌లో ఎన్టీఆర్ చిత్రం బిజినెస్‌..!

ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి త‌మ‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని, కావాల‌ని, ఉద్దేశ‌పూర్వంగానే త‌మ‌ను ఈ చిత్రంలో నెగిటివ్‌గా చూపించ‌నున్నార‌ని, ఆరోపిస్తూ.. ఈ సినిమా నిర్మాణాన్ని బాల‌కృష్ణ‌కు నోటీసులు పంపారు. అయితే, బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబ‌ట్టి.. ఎమ్మెల్యే హోదాలో నోటీసులు పంపి.. ఆ త‌రువాత ప్ర‌ధాన నటుడు, నిర్మాత రూపంలో బాల‌కృష్ణ‌కు మ‌ళ్లీ నోటీసులు పంప‌నున్నారు.

see also:ప‌వ‌న్‌తో ప‌రిచ‌యం కొన‌సాగుతుంది..!