తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ మెగా156 అని ఖరారు చేశారు చిత్రం యూనిట్.
ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో మృణాల్ ఠాకూర్, అనుష్క శెట్టీ లు ఉన్నట్లు సమాచారం . మరోవైపు ఈ చిత్రంలో దగ్గుబాటీ రానా విలన్ గా నటించనున్నట్లు మరో వార్త. ఎంఎం కిరవాణీ సంగీతం అందించనున్నారు.