దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. టాలీవుడ్ స్టార్ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కినట్లు సమాచారం.
డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు.
ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాహ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబమంతా శ్రీలంక వెళ్లగా.. 200 మంది అతిథులు పెళ్లికి హాజరయ్యారని సమాచారం.