Home / MOVIES / అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1

అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం పెదకాపు 1. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ  ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

సెప్టెంబరు 29న విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1 సినిమా స్ట్రీమ్ అవుతోంది.

ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్‌గా నటించగా.. రావు రమేశ్‌, నాగబాబు, అనసూయ, ఈశ్వరీ రావు, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat