ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. ఈ క్రమంలోనే అయన మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో స్పస్టమైపొయింది .ఇవాళ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ హైదరాబాదులోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. చాందీతో చర్చల తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై స్పష్టత వచ్చిదంటున్నారు పలువురు నేతలు . ఐతే.. ఈ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కిరణ్ తన అభిప్రాయం మాత్రం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి రప్పించేందుకు అధినాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.ఈ సమావేశానికి ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు.
