అల్లరి సినిమాతో తన టేస్ట్ ఏంటో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన రవిబాబు.. ఆ తరువాత పలు సినిమాలతో రవి బాబు అంటే ఓ తెలియని క్రేజ్‌ను ఏర్పరుచుకున్నారు. అయితే, గతంలో పంది పిల్లతో సినిమా తీస్తా అంటూ ప్రకటించి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన రవిబాబు.. పంది పిల్లకు సంబంధించిన స్టిల్స్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేసి ఆకట్టుకున్నారు రవిబాబు.
అయితే, ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ముగిసి చాలా కాలమే అయినా.. రవిబాబు మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. అదిగో.. ఇదిగో పందిపిల్ల అని చెబుతున్నారే కానీ, అసలు డేట్ మాత్రం చెప్పడం లేదు. దీంతో సినిమా ప్రేక్షకులు ఈ చిత్రం అప్‌డేట్స్ గురించి చర్చించుకోవడం మరిచిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా రవిబాబు ఒక వీడియోను పోస్ట్ చేశారు. పందిపిల్లను పైన కూర్చోబెట్టుకుని.. పుషప్స్ చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఆ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.