Home / NATIONAL / నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!

నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!

రైల్వే పోలీసులు, ప్రయాణికుల అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో పట్టుతప్పి ప్రమాదవశాత్తూ అదే రైలు కింద పడబోయాడు. అది గమనించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులు అతడిని రక్షించారు. ముంబయిలోని పాన్వల్‌ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 14న ఈ ఘటన జరిగింది.