2019వ నూతన సంవత్సర వేడుకలను వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతుండగా అందరికీ అభివాదం చేస్తూ, భరోసానిస్తూ జగన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని పండుగలనూ ప్రజలతోనే జరుపుకున్నారు.
ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల ప్రజలందరికీ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిగా నాకు అండగా ఉంటూ నాపై మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.