వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసి ఊసలు లెక్కపెడుతున్న జనుమిల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విలపిస్తున్నాడని సమాచారం. శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీనివాసరావు తనను బెయిల్‌పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా జైలులో ఉంటేనే మంచిదని లాయర్ అన్నారు. అందుకు కారణాలు కూడా వెల్లడించారు. ఎందుకంటే శ్రీనివాసరావు బయట ఉంటే అతని ప్రాణానికి ప్రమాదమని లేకుంటే బెయిల్ కోసం అప్లై చేసేవాళ్ళమని లాయర్ వెల్లడించారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న శ్రీనివాసరావు డిప్రెషన్, ఫ్రస్టేషన్ తో ఉన్నాడట.. ఈరోజు శ్రీనివాస్ కు ఎన్ఐఏ రిమాండ్ ముగియనున్నా ఫిబ్రవరి 22 వరకు రిమాండ్‌ను పొడిగించే అవకాశం ఉందట.. ఈ అంశంపై శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద జైల్లో ఉన్న శ్రీనివాసరావు, అలాగే అతని తరపు న్యాయవాది మాత్రం అతను బయటకు వస్తే ప్రాణాలకు ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు. పరోక్షంగా శ్రీనివాసరావు విచారణలో జగన్ పై హత్యాయత్నం చేయించినవారి పూర్తి వివరాలు బయట పెడతారని ఆ హత్యకు ప్రేరేపించినవారే ఈ విధంగా శ్రీనివాసరావునూ చంపేందుకు ప్రయత్నిస్తున్నారనే భయంకరమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.