Home / 18+ / కంగనా ర‌నౌత్‌పై చెప్పు విసిరిన డైరెక్ట‌ర్‌..ఎవరో తెలుసా?

కంగనా ర‌నౌత్‌పై చెప్పు విసిరిన డైరెక్ట‌ర్‌..ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో వివాస్ప‌ద హీరోయిన్ ఎవ‌రు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగ‌నా ర‌నౌత్‌దే. కెరీర్ మొదటి నుండి ఎన్నో వివాదాల‌తో సావాసం చేస్తు వచ్చింది. ఇటీవ‌ల తను న‌టించిన చిత్రం మ‌ణిక‌ర్ణిక…ఈ సినిమా పెద్ద వివాదం అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఝాన్సీ ల‌క్ష్మీ భాయి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమాకి దర్శకుడు క్ర్రిష్ నటి కంగనా మధ్య చాల గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొదట ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

అయితే క్ర్రిష్ కు ఆమె ఒక కండిషన్ పెట్టింద‌ట.అదేమిటి అంటే సినిమాలో త‌న పాత్ర ఎక్కువుగా ఉండాలని డిమాండ్ చేసిందట.క్ర్రిష్ దీనికి నో చెప్పడంతో ఈ దర్శకుడుని ఏకంగా సినిమా నుండే తప్పించింది.ఎలాగైతేనో మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యింది. అనంతరం క్రిష్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేసింది కంగనా.

ఇదంతా పక్కన పెడితే కెరీర్ స్టార్టింగ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌టన‌ను మీడియాతో పంచుకుంది కంగ‌నా.అయితే ఇందులో ఒక గొడవ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.2006లో కంగనా రనౌత్‌ నటించిన వాహ్‌ లంహే చిత్రం చూసేందుకు వ‌చ్చిన తనపై బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్ చెప్పు విసిరాడ‌ని కంగనా సోదరి రంగోలి ట్విట్ ద్వారా బ‌య‌ట‌పెట్టింది.భట్‌పై ఉన్న కోపాన్ని కంగ‌నా ఇప్పుడు ఆయ‌న కూతురు అలియా భ‌ట్ మీద చూపిస్తుంద‌ని అందరు అనుకుంటున్నారు.