Home / CRIME / పబ్జీ ప్రేమికులకు చేదువార్త

పబ్జీ ప్రేమికులకు చేదువార్త

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు.

మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి వచ్చింది.”అరేయ్ వాడు నీవెనకాలే వస్తున్నాడు. వాడ్ని చంపేయ్. పక్కనే గన్ ఉంది . తీస్కుని చంపేయ్ రా. వాళ్లు ఇంకా పది మంది ఉన్నారు.వాళ్లను చంపేయ్ అని ఒకటే గోల.

చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని మరి బయట ప్రపంచాన్ని సైతం మరిచిపోయి మరి పబ్జీ లో లీనమై పోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పాతబస్తీ యువకుడు పబ్జీ ఆడుతూ పిచ్చోడు అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది.యువకుడికి పిచ్చెక్కడంతో హైదరాబాద్లో రోడ్లపై తిరుగుతున్నాడు..