Home / MOVIES / విడుదలైన ర‌ణ‌రంగం ఫస్ట్ లుక్

విడుదలైన ర‌ణ‌రంగం ఫస్ట్ లుక్

కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం కాజ‌ల్ కిట్టీలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉండ‌గా, శ‌ర్వానంద్‌తో క‌లిసి ర‌ణ‌రంగం అనే సినిమా చేస్తుంది. ఇందులో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కూడా న‌టిస్తుంది. సుధీర్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. కాజ‌ల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ర‌ణరంగం చిత్రంలోని ఆమె లుక్‌ని విడుద‌ల చేశారు.మీరు ఒక లుక్ వేయండి..